ఉద్బోధ
ఉద్బోధ


దారంతా సాఫీగా జీవితం ఉంటుందా
రణగొణ ధ్వనుల జీవితంలా దారుంటుందా
మనుషులు మౌనం వహించినవేళ
చెట్లన్నీ ప్రశ్నించే గొంతుకలైతే
ప్రశ్నలకు కొన్నైనా సమాధానాలు వచ్చేవేమో
అద్దంలా ఉదయం అసంతృప్తులను తుడిచేస్తుంది
కొత్తదారిలో మనసును నడిపిస్తుంది
శీతలపవనాలు పీల్చిన వనాలు
శిశిరోదయాన్నాహ్వానిస్తూ
కొత్తరూపుకు ప్రణాళిక వేస్తాయి
కాలం గాయాలు చేస్తూనేఉంటుంది
మరపుమందు వేస్తూనే ముందుకు సాగమంటుంది
బారులుతీరిన జనసందోహం మధ్య
జీవితం ఎగుడుదిగుళ్ళ పగుళ్ళను సరిచేసుకోవాల్సిందే
ఒంటరిదారి ఉద్బోధిస్తోంది