మా చిన్నారి రాజకుమారి
మా చిన్నారి రాజకుమారి
పాల బుగ్గల పసిడి బొమ్మ
మా ఇంటి ముద్దుల గుమ్మ
ముక్కోటి ఏకాదశి రోజు
మా ముంగిట నిలిచి
ముద్దు మురిపాలు పంచావు
చిలిపి చేష్టల చిత్రాలు చేశావు
చిలుక పలుకుల చిలక
మా బంగారు మొలక
అల్లరి,అలకల అమ్మాడి...
షికార్లు అంటే హుషారుగా
లేచి గంతులేస్తోంది...
మా ముద్దుల చిన్నారి
చిరునవ్వుల చిరుజల్లులు కురిపించి
మదిని మైమరిపించావు....
చిరు పాదాల గజ్జెల
సవ్వడి తో సందడి చేశావు....
ఆట పాటలతో అలసిన వేళ
గుండెల మీద గువ్వలా ఒదిగిపోతుంది
నీ మధుర జ్ఞాపకాలు కలకాలంమా మది లో నింపెను ఆనందాల హరివిల్లు
మా చిన్నారి రాకుమారి చిరంజీవిగా
సంతోషం గా ఉండాలని అభిలాష