ఆమె గమ్యం
ఆమె గమ్యం


నాదొక చిన్న అందమైన ప్రపంచం
నా కుటుంబమే నా సర్వస్వం
ఇల్లు,చదువు,స్నేహితులు
ఇవే నా లోకం
నా లోకం లోకి నాకే తెలియకుండా వచ్చావు
నా ప్రపంచాన్ని మర్చావు.....
కొత్త ప్రపంచ లోకి నన్ను తీసుకెళ్లావు...
కొత్త గా గమ్మత్తు గా నేనేనా
అనెలాగా నన్ను మార్చావు...
ఇప్పుడు ఈ కొత్త ప్రపంచం లో
నాకు నువ్వు తప్ప వేరే ఎవరు లేరు
కానీ ఇప్పుడు నువ్వే లేవు...
నాకు ప్రపంచమంతా శూన్యం గా కనిపిస్తుంది
ప్రపంచం మొత్తం లో నేను
ఒంటరిగా ఉన్నట్టు ఉంది...
ఈ ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి
నీలో ఐక్యం కావాలని ఉంది
కానీ నికు ఇచ్చిన మాట కోసం
నీ జ్ఞాపకాల తో చివరి పిలుపు
వచ్చేదాకా వేచి ఉంటా.....
నీలో ఐక్యం అయ్యాకే
నా గమ్యం ముగుస్తుంది