కొత్త జీవితం
కొత్త జీవితం


పెళ్లి చేసుకొని కొత్త జీవితం లోకి
అడుగు పెడుతున్న అనుకున్నా
కానీ అగాధం లో పడుతున్న అని
తెలుసుకోలేక పోయాను
కొత్త సంతోషాలతో, కొత్త బంధాలతో
మధురం అవుతుంది అనుకున్నా జీవితం
కానీ కష్టాల కడలిలో కూరుకు పోయాను
ఆనంద తీరాలు చేరుతుంది అనుకున్న మజిలి
అనంత వాయువుల్లో కి చేరుతుంది....
అనుక్షణం అనుమానం తో
అవమానాలకు గురిచేస్తుంటే
అణువణువు ఆవేదన భరితమై
తనువంతా, మనసంతా
చిత్రవధకు గురి అయ్యి
తనువు చాలించాలి అన్నంత
మనో వేదన మనసును మేలిపెడుతుంది
మనో వేదన మట్టిలో కలిసే వరకు
నన్ను వీడి పోదేమో....