అంతరంగం లో ఆమె జ్ఞాపకం
అంతరంగం లో ఆమె జ్ఞాపకం
Prompt:2
ఊహాలోకం లో విహరిస్తున్న నన్ను
నేనే నీ ఊహ సుందరి అన్నావు
నీ ఊసులతో ఊయలలు ఊపావు...
నీ ఊహలతో ఊపిరి పోసావు....
ఊహ కందని అందాల లోకాన్ని చూపించి
సంతోషాల హరివిల్లు నింపావు
ప్రేమ అనే మైకంలో ముంచి
విరహం లో తపించిపోయే లా చేశావు
నీ ఆలోచనల లో అనుక్షణం మునిగేలా చేశావు....
ప్రేమ మంత్రం వేసావు.....
నువ్వే నా ప్రాణం అన్నావు
నువ్వే నా ప్రాణం అనేలా చేశావు
చివరికి ప్రాణం తీసి వెళ్ళావు
ప్రాణం లేని బొమ్మలా మార్చవు
నీ జ్ఞాపకాల ఉప్పెనలో
ఊపిరి వదిలేలా చేశావు