బంధాల బంధీ
బంధాల బంధీ


బాల్యం లో బడికి వెళ్లాల్సిన నేను
బాధ్యత లలో బంది అయినాను
పుస్తకాల తో కుస్తి పట్టాల్సిన నేను
పని చేయడానికి కుస్తీ పట్టాల్సి వచ్చింది
పరీక్షలకు ఆందోళన చెందే వయసులో
ఆకలి బాధ తగ్గించేందుకు ఆందోళన
బాల్యపు మధురానుబూతులు వుండే వేళ
కష్టాల గుణ పాఠం,బాధ ఉన్నాయి
యవ్వన దశలో కుటుంబ బంధాలు
ఆ బాధ్యతల కష్టాలు మొదలయ్యాయి
పిల్లల భవిష్యత్తు పై బాధ్యత
నిరంతరం కష్ట పడేలా చేశాయి
ఇలా ప్రతి దశ లో కష్టా లు
నాకంటే ఒక్క అడుగు ముందే వేశాయి
ఈ కష్టాల ప్రరంపర కట్టే కాలే లోపు
అగుతుందో లేదో ఆ భగవంతుడు కే తెలియాలి....
ఆ బంధాల బంధి కానా నుండి ఎప్పుడు
విముక్తి లభిస్తుందో ఆ దేవుడికే తెలియాలి