కరోనా వైరస్
కరోనా వైరస్
Prompt:1
ప్రపంచ మానవాళిని
కమ్ముకొస్తున్న కరోనా వైరస్
ప్రపంచం అంత ప్రయాణించి
ప్రాణాలను హరిస్తుందనీ
కరోనా వైరస్ కంగారులో
కంటి మీద కునుకు మాయం
కాళ్ళు కదపటానికి జంకై వైనం
అనుక్షణం ఆందోళన అణువులు
ప్రాకి ఆయువు తీస్తుందని
ముత్యమంత ఉన్న వైరస్
మృత్యుకెరటమై ముంచేస్తుందని
జన సందోహం లో ప్రయణమంటే
జనాలు జంకే వైనం
ప్రతి నోటా కరోనా మాటే
గాలి ద్వారా వ్యాపిస్తుంది అని
గాలి వార్త చక్కెర్లు కొడుతుంది
కరచాలనం తో కరోనా సోకుతుందని
సంస్కారం గా నమస్కారం చేస్తున్నారు
ముసుగు లేకపోతే ముప్పు వస్తుందని
ముచ్చెమటలు పడుతున్నాయి
మాట్లాడాలంటే మాస్కులు
తుమ్మితే తువ్వాల్లు
దగ్గితే దస్తులు
కరాన్ని కడగటం మాటిమాటికీ
ఎందుకంటే కరోనా సోకితే వైద్యం
లేదని కలత తో జాగ్రత్త చర్యలు
కరోనా వైరస్ చల్లదనం లో చాలా సేపు ఉంటుంది
వెచ్చదనం లో హరించుకుపోతుంది
కరోనా కి నిహరణ పరిశుభ్రత
పరిశుభ్రతే పరమ ఆయుధం