STORYMIRROR

my dream stories (sindhu)

Children Stories Drama

4  

my dream stories (sindhu)

Children Stories Drama

అమ్మ( ఆది గురువు)

అమ్మ( ఆది గురువు)

1 min
23K

 అమ్మ ఆదిగురువు

అక్షరాలను అమృత గుళికలు

చేసి అధరాలలో నింపుతుంది

ముద్దుగా పలికే అక్షరాలను

మురిపెంగా వింటూ మురిసిపోతుంది

నడక నేర్పి ముందుకు నడిపిస్తుంది

నువ్వు నేర్చుకునే అక్షరానికి పట్టు కలిపించి

పట్టుదల గా నేర్చుకునే లా చేస్తుంది....

అదే పట్టుదల తో ఉండేలా చూసుకుంటూ

నీ అడుగుల పట్టు కలిపిస్త్తు నీ కాళ్ళ మీద నిన్ను 

నిలబడేలా చేస్తుంది....

నిన్ను పైకి ఎదిగేలా చేస్తుంది .....

ఆ ఎదుగుదలను చూసి మురిసిపోతుంది

నీ ఆనందం కోసం అహర్నిశలు పాటు పడి

ఆనందమయ జీవితానికి అండగా ఉంటుంది

నీ ఆనందాన్ని చూసి అంతులేని తృప్తి

చెంది తన కష్టాన్ని మర్చీ పోతుంది....

అమ్మ అంతులేని ప్రేమ కి నెలవు

 ఆ ప్రేమే పిల్లల కి వెలుగు....

అలాంటి అమ్మలంధరికి వందనం పాదాభివందనం



Rate this content
Log in