నీలో ఒదిగిపోవాలని....
నీలో ఒదిగిపోవాలని....




"ఎక్కడినుండి వచ్చావో తెలీదు....అనుకోకుండా నా జీవితంలో అడుగుపెట్టావు....
ఎదురు పడినప్పుడల్లా....నా గుండె వేగాన్ని పెంచావు.....
ఒక్క చిన్న చిరునవ్వుతో నా గుండెలో గూడు కట్టుకుని....అందులో పదిలంగా ఒదిగిపోయావు.....
నీ స్పర్శతో నన్ను స్వర్గంలోకి తోసిపడేసావు....
పసిపిల్లల్లాంటి కల్మషం లేని నీ హృదయంలో నన్ను పదిలంగా దాచుకున్నావు......
నన్ను లోక్కాన్నే మరచిపోయేలా చేసే అందమైన కళ్ళు....అందులో చేప్పలేనన్ని భావాలు....
బాపు బొమ్మను మైమరిపించేలా ఉండే నీ అందం....
ఇవన్నీ నా సొంతం అని అనుకున్నప్పుడల్లా కలిగే ఆనందం చెప్పలేనిది.....
నా ఊపిరివైపోయిన నా బంగారానివి నువ్వు....
జీవితాంతం నీ ప్రేమలో మునిగి తేనెల విందు చేస్తూ....నీలో ఒదిగిపోవాలని నా కోరిక....