ఆడకూతురా... నీకు జోహారు
ఆడకూతురా... నీకు జోహారు

1 min

321
ఆడకూతురా... నీకు జోహారు
నీకు సాటి ఎవరూ లేరమ్మా
పరిపూర్ణమైన జన్మ పొందిన నీకు జోహారు
ఆడజన్మకు సాటి ఏదీ లేదమ్మా
సహనానికి మారుపేరైన భూదేవి ఆడదే
చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే
ధనధాన్యలు కలిగించే లక్షీదేవి ఆడదే
శక్తిస్వరూపిణి జగన్మాత దుర్గాదేవి ఆడదే
జగములను ఏలే ఆ వనితా మూర్తుల
అంశలతో భువిపై పుట్టిన దేవతవమ్మా
కూతురివై పుట్టినింట సుఖసంతోషాలను కలిగించేవు
కోడలివై మెట్టినింటి కీర్తిప్రతిష్టలను పెంచేవు
ఆళివై నీ మగనికి తోడునీడగా మెలిగేవు
తల్లివై నీ బిడ్డలను కనురెప్పలా రక్షించేవు
నలుగురికి వెలుగులను పంచుతూ కొవొత్తివై కరిగేవు
సృష్టికి మూలం జగతికి ఆధారం నీవే తల్లి