నీవెవరు? నేనెవరు?
నీవెవరు? నేనెవరు?


నీవెవరు? నేనెవరు? మనవారెవరు?
ఎచట నుండి వచ్చామో? ఎచటికి పోతామో ?
నిను కన్న తల్లిదండ్రి, నువ్వు కన్న బిడ్డలు
రారెవరూ నీతో నువు పోయేనాడు
దేహంలో ప్రాణం ఉన్నంతవరకే బంధం
శవమై మిగిలిన నాడు ఎక్కడుంది ఈ బంధం ?
నూరేళ్ళు పెంచి పోషించిన ఈ దేహం
కడకు నిను విడిచి భస్మమై పోవును
ఒడలొంచి కూడబెట్టిన ప్రతి పైసా
చివరకు నిను చూసి గలగల నవ్వును