నిన్ను నీవే తెలుసుకో
నిన్ను నీవే తెలుసుకో


నిన్ను నీవే తెలుసుకో, నీ జీవితాన్ని మలచుకో
నీకు నీవే గురువుగా సాగిపో నేస్తమా
నాకు రాదు, నావల్ల కాదు, నే చేయలేను అనుకోకు
నిన్ను నీవు విశ్వసించి ఫలితం ఆశించక ప్రయత్నించు
విజయం నీదైతే పొంగిపోకు, పతనమే వరిస్తే క్రుంగిపోకు
విజయానికి అంతం లేదు, విఫలమే విజయానికి నాంది
నీ ఆశలే ఆశయాలకు పునాదులు అవుతాయి
ఆశయాలన్నిటిని సాధించు, ఆశలన్నీ ఛేదించు
నేస్తమా రెప్పపాటు కాలంలో నీ ఆశయం సాధ్యం కాదు
ఎంతకాలమైనా సహనాన్ని వీడక ముందుకు సాగిపో నేస్తమా