చేర్పు
చేర్పు


ప౹౹
తొలి ప్రాయం తోరణమై చూచే ఆమెకోసం
చెలి గేయం చేరువగా వేచే కోరి సహవాసం ౹2౹
చ౹౹
ఎలప్రాయపూ ఎలమి ఎద నిండి వేడుకగా
ఎలబారి ఆ కలిమి మదినే దాచి వాడుకగా ౹2౹
వెన్నెల వెలుగు సన్నగ పరచుకొని నిండుగ
కన్నుల సోయుగం కలలనే పంచే మెండుగ ౹ప౹
చ౹౹
ఆమనే దిగిరాగా ఈ ఆవనే మురిసే మెల్లగ
ఆమెనే కలిసి మదిలో మరులే పెంచే చల్లగ ౹2౹
చక్కని కావ్యమై ఆ మనసునే మరిపించిలే
చెక్కిన శిల్పమై చేకూరిన చెలిగ కనిపించిలే ౹ప౹
చ౹౹
ఎంత వైభవమో ఎంచిన తరుణి సౌందర్యం
చింత తొలగు చెంతచేరి చూపినా ఔదార్యం ౹2౹
ఎదురుచూపులూ ఎడదలో ఆమెకోసమేగా
చెదరిన మనసుకూ ఆ చేర్పు అవసరమేగా ౹ప౹