The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

మీమాంస

మీమాంస

1 min
353


ప౹౹

ఏనాటిదో ఆ స్వప్నం ఎదలోనే నిలిచింది

ఆనాటిదీ కలో నిజమో ఎలాగా తెలిసేదీ ౹2౹


చ౹౹

ఒక మౌనానికీ ఎన్ని అర్థాలో కనుగొననా

ఏకమై పారవశ్యమే ఎదురేగ వేడుకొననా ౹2౹

కనిపించని సౌఖ్యం కళ్ళెదుటే తారసిల్లగా

అనిపించే ఆ హాయీ ఆమెయై విలసిల్లగా౹ప౹


చ౹౹

గుండే గాయమయిందీ ఆ రూపమే చూసి

మండే ఎండలోకూడ మంచే కురిసే ఎగసి ౹2౹

ఎడద ఊసులే ఊగే ఆ భావనే హత్తుకొని

ఎడమన్నదిలేక ఎద పులకించే మత్తుకొని౹ప౹


చ౹౹

కాలము కలసి పున్నమినే పూయించునా

కాలమూ చెల్లి కల చెదరి పలాయించునా ౹2౹

నాలోని ఆ ఊహలే నన్నొదిలి పరిగిడునా

నాలోనేనే తలమునకలతోనే తిరుగాడనా ౹ప౹



Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance