STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ చూపుల గీతం

నీ చూపుల గీతం

1 min
7

వెన్నెలింటి ఊట కదా.. నీ చూపుల ఆ గీతం..!

మేలుకొలుపు పాట.. కదా నీ పలుకుల ఆ గీతం..!


గుండెలయల కోవెలలో..ఎన్నికోట్ల దీపాలో..

మెరుపుపూల తోట కదా..నీ వలపుల ఆ గీతం..!


ప్రతి శ్వాసకు అమృతధార..నింపుతోంది నీ తలపే..

మౌనవీణ పంట కదా..నీ పదముల ఆ గీతం..!


పవిత్రతకు అద్దమేదొ..చెబుతున్నది నీ నవ్వే..

అందాలకు బాట కదా.. నీ అడుగుల ఆ గీతం..!


అవిశ్రాంత విరామాల..ఆరామం నీ సన్నిధి..

పసిడివెలుగు కోట కదా..నీ సొగసుల ఆ గీతం..


Rate this content
Log in

Similar telugu poem from Romance