కుందనపు బొమ్మ
కుందనపు బొమ్మ
పంచదార బొమ్మ సరే..బొట్టెందుకు పెట్టుకోదొ..!?
తనను తాను తెలుసుకోగ..కళ్ళెందుకు మూసుకోదొ..!?
మోసమయే లోకంలో..సిగ్గుపూల చేమంతిరొ..
ఎంత నిండుగా ఉన్నా..తననెందుకు దాచుకోదొ..!?
గుచ్చుకునే చూపులతో..పనేలేని వృత్తి కదా..
కాలిపోవు వత్తిలాగ..మనసెందుకు విప్పుకోదొ..!?
తిరుగులేని వేషాలను..వేస్తున్నా సాక్షి తాను..
సంప్రదాయ పారాణిని..అసలెందుకు పెట్టుకోదొ..!?
కష్టాలను సిగపూలుగ..ధరించటం నేర్చుకుంది..
కుందనంపు బొమ్మ కదా..వలపెందుకు పంచుకోదొ..!?

