ఇప్పుడు
ఇప్పుడు
ప్రేమంటే మోహమనీ తెలిసిందా ఇప్పుడు
వాగంటే పరుగేనని. , తెలిసిందా. ఇప్పుడు
వలపు మాత్ర చేదుకన్న గరళమెక్కడున్నదీ?
తలపు తీపి లోయల్లో కలిసిందా ఇప్పుడు!?
ఎదురుచూపు చుక్కాని తొ విరహఝరిని దాటగలను!
నువులేవను వార్త ,, కనుల చూపిందా ఇప్పుడు..?
చిరుశ్వాసనె ఆగిపోవు క్షణమిదియే ఓ ప్రియా!
కలనైన, నా కనురెప్పను మూసిందా ఇప్పుడు?
హృదయం మైదానంలో ఆటాడుట సంబరమా!?
ఓటమి శివరంజని తాళం వేసిందా ఇప్పుడు.?.
నీ సుఖమే కోరుకొంటి...ముళ్ళబాట నే నడచితి!
గాలిలోన సుమగంధం తాకిందా ఇప్పుడు!

