మధుపాత్ర
మధుపాత్ర
అసలు-మధువు త్రాగలేని..బ్రతుకెందుకు దండగ..!
మధుపాత్రగ మిగలలేని..మనసెందుకు దండగ..!
మెఱుపుతేనె ధారలింట..ఆగుటెంతొ ముచ్చట..
మౌనములో చేరలేని..పలుకెందుకు దండగ..!
దండచాటు దారంలా..జీవించుట మధురము..
చిత్తరువుగ నిలువలేని..చూపెందుకు దండగ..!
భగవంతునికై వెతికే..కనులదెంత భాగ్యము..
భక్తినదిగ మారలేని..పరుగెందుకు దండగ..!
మానవతకు అద్దంలా..ఉన్నహృదియె నీదోయ్..
నీలోనువు మునగలేని..తలపెందుకు దండగ..!
పదునుకత్తి అంచులపై..నాట్యమెంత హాయో..
నటియించగ ఓపలేని..బలమెందుకు దండగ..!

