చెప్పలేదు
చెప్పలేదు
దిగివచ్చిన దేవత తన..దిగులదేమొ చెప్ప లేదు..!
కాలుష్యపు భువిని చూచి..కలతదేమొ చెప్ప లేదు..!
ఈ పుడమియె ఓ బంగరు తోటలాగ దొరకకనే..
తట్టుకునే పట్టు తప్పి..జారెనేమొ చెప్ప లేదు..!
తన బాధను వివరించగ మాటలేవొ తోచకనే..
తలవంచుకు తనలో తను మునిగెనేమొ చెప్పలేదు..!
తన రెక్కల వెండి వెలుగు పంచేందుకు విచ్చేసియు..
తీసుకొనెడు ప్రియుల జాడ వెదికెనేమొ చెప్పలేదు..!
మౌనవీణ యైన మనసు విప్పలేక విరహిణియై..
యాంత్రికతకు వేసారుచు విసిగెనేమొ చెప్పలేదు..!

