కన్నులార
కన్నులార
మంచిగజల్ కనిపిస్తే..మెచ్చకనే ఉండలేను..!
వ్రాసిన వారెవరైనా..మొక్కకనే ఉండలేను..!
నిజానుగ్రహ ధారకై..తపమెవ్వరు సలిపేరో..
ప్రయోగ కుశలత చూస్తూ..పొగడకనే ఉండలేను..!
భావావేశపు పొంగలి..వడ్డిస్తే చాలందును..
వహ్వాలను హరివిల్లులు..పూయకనే ఉండలేను..!
గలగలమను సెలయేరులె..కలకలమను ప్రతీకలే..
జాలువారు చమత్కృతుల..తేలకనే ఉండలేను..!
కనిపించని చందమామ..కనికరమే నికరములే..
చతురతలకు సన్మానము..చేయకనే ఉండలేను..!
గజలియతను వల్లెవాటు..జారనీని కోమలితో..
సల్లాపము కన్నులార..జరుపకనే ఉండలేను

