సరికొత్తగా
సరికొత్తగా
మాటలన్ని పాతవేగ..మౌనమదే సరికొత్తగ..!
చూపులన్ని పాతవేగ..రాగమదే సరికొత్తగ..!
పోటీపడు తత్వానికి..బానిసవే జన్మలుగా..
వలపులన్ని పాతవేగ..సరసమదే సరికొత్తగ..!
పూవులపై యుద్ధమేల..పరిమళిస్తు రాలేనా..
సొగసులన్ని పాతవేగ..హాసమదే సరికొత్తగ..!
ఒక పాటల నగరంలా..మెరిసేదే మనసంటే..
తలపులన్ని పాతవేగ..హృదయమదే సరికొత్తగ..!
ఉద్యోగం ఏదైనా..సద్యోగం సంగతేమి..
సిగ్గులన్ని పాతవేగ..మోహమదే సరికొత్తగ..!

