తొలి చూపులో
తొలి చూపులో
జాబిలి కిరణాలను మెత్తగా హత్తుకొని
మల్లెల రేకుల కన్నులు విచ్చుకున్న వేళా
మదిలో నీ మధురోహల
సందళ్ళు చిలిపిగా సద్దు చేస్తున్నవేళా
నిదురరాని నాకనుపాపల కలలకాంతుల్లో
కొంటేనవ్వుల కోణంగిలా చేరలాడుతుంటే
తొలిసారిగా తొలిచూపుతో నా గుండెను
నీగడసరి సొగసుల సోయగాలతో
నీ సొత్తుగా స్వంతం చేసుకున్న ఆక్షణాలు
నా హృది మరి మరి నెమరేస్తూ పులకాంకిత ఔతుంటే
మది శ్రావణమాస నీలిమేఘమాలలా
తొలి చినుకును ముద్దాడిన పూరేకులా
తొలి ఉషస్సు విరిసిన కిరణంలా
తొలకరి చినుకును దాచిన ముత్యపుచిప్పలా
కార్తీకం కాసిన చిక్కని వెన్నెలలా
హేమంతం చల్లిన మంచు పూల జల్లులా
వేకువమ్మా ముంగిట్లో ముసిరిన తెలి వెన్నెల రేఖలా
ఉల్లం లో నీ తలపులు నా ఊపిరి ఊయలలై
మది గుండు తుమ్మెదల్లే నీ ఎద పుష్పo పై వాలి
ప్రేమ మధువును గ్రోలుతోంద.

