చెలిమి
చెలిమి
చెలిమి పూల సంతకాలు చేసి చూడు ఒక్కసారి.
కలిమి ముళ్ళ దారులన్ని మూసి చూడు ఒక్క సారి....!
ఊహలతో కోటలన్ని కట్టేయకు ఇకనైనా.
వాస్తవాల పొదలన్నీ కదిపి చూడు ఒక్కసారి
తలరాతే మారిందని సంతసంగ తలవూపకు..
పొలమారిన.., అమ్మ ప్రేమ తరచి చూడు ఒక్కసారి.
వయను ఆగిపోయిందని మురిసిపోకు ఓ శ్యామా!
కురులకైన రంగేయుట మాని చూడు ఒక్కసారి...!
వెన్నెవంటి మనసుందని పొంగిపోయి జారబోకు
ఆ మనసే శత్రువటా! ఎరిగి చూడు ఒక్కసారి...!..

