STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చీకటి ప్రేమిస్తూ

చీకటి ప్రేమిస్తూ

1 min
6

చీకటినే ప్రేమిస్తూ చిరుదివ్వెగ ఉంది నేను..!

వెలుగును ఆరాధిస్తూ చిరునవ్వుగ ఉంది నేను..!


బంధుత్వపు గంధాలకు అతీతమౌ మెరుపేదో..

చెలిమినిధిని వర్షిస్తూ ఓ రవ్వగ ఉంది నేను..!


మౌనగగన వీధులలో అక్షరాల హంసేదో..

విశ్వశాంతి పండిస్తూ ఓ గువ్వగ ఉంది నేను..!


జన్మవీణ మీటుతున్న నాదాలకు మూలమేదొ..

గుండెలయలు అలరిస్తూ ఓ మువ్వగ ఉంది నేను..!


లోకాలను చుట్టివచ్చు సూత్రమేదొ చెప్పాలా..

అరకన్నుల మురిపిస్తూ మరి అవ్వగ ఉంది నేను..!



Rate this content
Log in

Similar telugu poem from Romance