కనులలోన
కనులలోన
కనులలోన అంతులేని వలపుందని తెలుసుకోవు
మనసులోన ప్రేమపూల వనముందని తెలుసుకోవు
నీ తనువున వంపుకొక్క ధనువుందని తెలుసుకోవు
సంధించిన బాణాలకు సొగసుందని తెలుసుకోవు
తాకుతున్న నా చూపును రంగులలో ముంచగలవు
అణువణువున వానవిల్లు మెరుపుందని తెలుసుకోవు
చిరునవ్వులు పెదవిమీద కనిపిస్తే మోసపోకు
గుండెలోన మోయలేని దిగులుందని తెలుసుకోవు
మాటలోని మధువంతా ఎచట ఒంపుతున్నావో
మౌనంలో మదిని కాల్చు విషముందని తెలుసుకోవు
చింతనిప్పులైన కనులు ఎలా మండుతున్నాయో
నిను చూపే స్వప్నాలకు కరువుందని తెలుసుకోవు

