చిరుగాలి
చిరుగాలి
చిరుగాలి వీచేను రాగాలు పాడావు !!
హృదయాన్ని మీటావు మైమరచి పోయాను !!
సాయం సంధ్యనేళ అర విరిసిన సుమ మాలికలల్లే వేళ !!
సూరీడు కొండ మరుగైయ్యే వేళ !!
ఆకాశమంతా చీకట్లు అలుముకునే వేళ !!
జాబిలికై నిరీక్షణ మనసు నిండా
తియ్యని భావనలు నింపి!!!
తనువంతా మధుర గాయాలు చేసి
ఒడి నిండా చల్లటి వెన్నెలను నింపి!!
ఇంధ్ర ధనస్సు లాంటి రంగుల హరివిల్లును గీసి
పరిమళ మకరందాలు చిలికి తుర్రుమంటూ
నింగికి ఎగసేవు నన్ను నేలపై వదిలి!!!
కన్నులు కాయలు కాచేలా నిరీక్షిస్తూవున్నా
ఎన్నాళ్ళిలా వేచేను హృదయం!!!!
వస్తావన్న ఆశ మిణిక్కు మిణిక్కు
మంటూ ఆరిపోతున్నది
కలనైనా ఇకపై అందేనా నవలోకం !!!!
ఆశలు ఆవలి తీరం దాటేనా !!!!!!

