అతని రాకకై
అతని రాకకై
అతని రాకకై.. కెంపుల ఆ నవ్వుల్లో..
అతని రాక ..మోహపు వాకిళ్ళలో..
పచ్చటి పూల తోరణమై మనసు పులకిస్తుంది..
అతడి మౌనమే సరాగ మధురిమై పాటలా వినిపిస్తుంది..
ఎటు చూసినాఅతడే కనిపించేరంగుల లోకంలో..
మనసున.. అతని రూపం ముద్రితమై.. మరులు పోతుంది..
ముసి ముసి తన నవ్వుల్లో రాలిన జాజిపూల చూపులు..
దేహాన్ని చుట్టి ప్రాణాల రాగాలనుశృతి చేసి..
పూల సుగంధంలా కమ్ముకుంటాయి..
అతడి ఆనవాళ్లునాలోని తన ప్రేమలా చిగురించి..
వసంతాల పచ్చదనాన్ని నింపాయి బతుకు తోటలో..
అతడో నడిచొచ్చే నవ్వుల పూదోట తనని చూసినంతనే..
ఎద లయల్లోహోరెత్తిన ఊహల మోహన రాగం మంద్రమై..
సిగ్గుల కెంపులు పూయించిoది బుగ్గల సొట్టల్లో..
ఎరుపెక్కిన కళ్ళల్లో అతడి రాక విరహ పవనాల..
ఆగమనాలకి తిలోదకాలిచ్చి అమృత వెన్నెల చణకులతో..
పున్నమి నవ్వింది నవ్విన తన నవ్వుల్లో..
యవ్వనం పూల తోటలుగా చిగురించింది..
ఏ భాషా రాయలేని భావం అతడే..
ఏ మౌనం చెప్పలేని భాషా అతడే..
పురా పరిమళాల బతుకు పుటల్లో..
అతడో అజ్ఞాత కవితలా తాకెళ్ళిన అలల సంద్రం కాదు..
ఏడడుగుల బతుకు బాటకి మునివేళ్ళ స్పర్శలా..
మనసు తాకిన తొలకరి జల్లు అతడు..
వేవేల జన్మల తోడు బంధం పాపిట వేకువలో..
ఉదయించినసింధూర వర్ణం అతడే..

