నిశ్చితార్థం
నిశ్చితార్థం


చూపుల ఘట్టం ముగిసింది
ఇరువురి సమ్మతి తెలిసింది
ఉంగరాలకు వేలాయే!
తరుణి రమణులు కదలండి
వేడుక చూద్దాం రారండి
ఇరువురి చూపుల ఒరవడిలో
మనసులో రేగెను చిరు అలజడులు
కురిసెను నవ్వుల జల్లులు
వినిపించెను పూబంతుల కిలకిల లిద్దరి
నడుమన ముచ్చట్లు
అతివలు చేసెను గుసగుసలు
పందిరిలో కడు సందడులు
కొత్తగ వచ్చెను చుట్టరికాలు
చుట్టుముట్టే అభిమానాలు
అందరి మోముల నవ్వుల జల్లులు
తలపించెను లే మతాబులు.