మరిచిన మనసు
మరిచిన మనసు


ప౹౹
మనసునే మరిచానూ మరి వెతికిస్తావా
సొగసునే చూసానులే కోరి జతకొస్తావా ౹2౹
కనిపించే అందమేదో కవ్వించే విందుకు
కనిపించనీ బంధము కదలే కలిపేందుకు ౹2౹
ఏమో అనుకున్నానూ చూసి ఎద కథలు
తనకేమో తప్పదే తకధిమి అదిమొదలు ౹ప౹
రూపాన్ని ప్రతిష్టించాకా మనసే మందిరం
కోపాన్ని మాని కరుణించవే నీకో వందనం ౹2౹
జారిన మదిలో జత కోసం కలవరింతలేగ
కోరిన హృదికొరకే పగలూ పలవరింతలేగ ౹ప౹
కళ్ళలోకి చూసాక కరిగినే మనసే మైనమై
వాకిళ్ళనే తెరచి వలపూ వరించినే ఏకమై ౹2౹
వెతికించి ఆ మనుసులో సేదను తీర్చవా
బ్రతికించి ప్రేమనూ రగిలే సెగను ఆర్పవా ౹ప౹