The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

విషయం

విషయం

1 min
360


ప౹౹

విషయమేదో తెలిసింది నాకు వివరముగ

నిమిషమైన చూడక తలిచా ఓ వరముగ|2|

చ||

ఆనాటి ఆశలు కలలు కాదు ఓ నిజమనీ

ఏనాటికైనా ఎదను మీటుట సహజమనీ|2|

ఎదురేగి పలకనా స్వాగతం పరవశమున

చెలరేగే ఆ ఊహలు లేవుగ నా వశమున|ప|


చ||

కొండద్దమున కొంచమై ఉండుట పరిపాటి

కొంటెతనంలో కోరిక ఆ ప్రేమకూ సరిసాటి|2|

మిగుల పండిన వలపునా తలపే రారాజు

మితమైనా తీపి పలుకే కోరుకద ప్రతిరోజు

|ప|

చ||

కనక వర్షం కన్న ప్రేమ వర్షమే మిన్న కాదా

కనిపించకున్న ప్రేయసి కలలు వృధాకాదా|2|

కనులే మూసిన ఆ స్వప్నమే సాక్షాత్కారం

కలను కళ్ళను కలిపేసి ఆపే ఆ తాత్సారం

|ప|


చ౹౹

చేతిలో చెయ్యేసి అప్పగించనీ ఆ బాసలు

చెప్పిన ఊసులు చేరిమితో చేరిన ఆశలు ౹2౹

ప్రతిగా పంచనీ మదిలో కూడే గిలిగింతలు

జతగా చేరి చెల్లించై ప్రేమలో అప్పగింతలు ౹ప౹


Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance