కొమ్మచాటు కోయిల
కొమ్మచాటు కోయిల
ప౹౹
కనుగొన్నానులే నీలోని ఏదో వింతను
అనుకొని ఆక్రమించి ఆ మనసంతను ౹2౹
ప౹౹
పూదారి పున్నమిలో వెన్నెలతో కలసి
గోదారి జడితో వెండి వెలుగల్లే వెలసి ౹2౹
వరాల జల్లై వర్షించి వరసా మరపించి
వివరాలూ చెప్పక ఆసక్తిని తానే పెంచి ౹ప౹
చ౹౹
కొమ్మచాటు కోయిలై కొత్తగా వినిపించే
రెమ్మపాటురాగమై రెక్కలిప్పి కనిపించే ౹2౹
తొలకరి పొద్దులో తొడిగిన ఓ పూవులా
గడసరి ఆశల గలగల తెచ్చిన నవ్వులా ౹ప౹
చ౹౹
కోరికేమో మదినంతా మంటలు లేపగా
చేరికతో చెలిమి పెరిగి చేతులు చాచగా ౹2౹
దాచేసిన అందాలను దగ్గరికి చేర్చలేవా
చూసేసిన నయగరాలే తృష్ణ తీర్చలేవా ౹ప౹