నిశీధి
నిశీధి


ప౹౹
నిద్రలేని రాత్రులూ నిశీధి ప్రేమయాత్రలు
ఊహలకు రెక్కలిచ్చి ఊరించే మాత్రలు|2|
చ||
అల్లి బిల్లి చుక్కల చదరంగం ఆకాశాన
చల్లచల్లని చందమామ సాగే పరవశాన|2|
కదిలే ఊహలు కాలమే మరచి కరగేను
మొదలే ఆ తలపులు మదిలో పెరిగేను|ప|
చ||
గుండెనిండా ప్రేమ ఊపిరే నిండనీ నీతో
పండుగల్లే మురిసెగా ఆ నచ్చిన పనితో|2|
మనసే మల్లెల పందిరి వేసి మురిపించే
సొగసే సోయగం కొత్త చినుకే కురిపించే|ప|
చ||
అందని ద్రాక్ష అందకే ఐనదిగా పులుపు
పొందిన ప్రేమకు పొందికైన పేరు వలపు|2|
నిశీధి రాయబారం నిక్కచ్చి ప్రేమ కోసం
నిర్యేదం నిభాయించూ కోరి సహవాసం|ప|