అన్వేషణ
అన్వేషణ


నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏమిటన్న
అన్వేషణలో దశాబ్ధాలు గడిచిపోయాయి!
మధుర క్షణాలు, చేదు అనుభవాల మధ్య గడిచిన
రోజులు మన బంధం ఏమిటో చెప్పలేకపోయాయి !
ఏనాటి బంధమో , ఏ జన్మ అనుబంధమో !
నిండుగా నవ్విన అనుభూతులెన్నో
నిద్ర లేని వ్యధాభరిత నిశివేళలెన్నో!
నన్నింకా ప్రశ్నిస్తూనే ఉన్నాయి , మన మధ్య ఉన్న బంధం ఏమిటని !
ఆకాశంలోని చుక్కల్ని చూసినా,
అందమైన చిరునవ్వుని చూసినా,
చిలిపిగా నవ్వే కళ్ళని చూసినా,
నా కళ్ళలో తళుక్కున మెరిసేది నీ రూపమే!
నీ జ్ఞాపకం రాని క్షణమేదీ నన్నింకా సంధించలేదు!
ఎలా గడపను నన్నికపై సందించే ప్రతి క్షణాన్ని ?!
నీ జ్ఞాపకాలని అక్షర సుమ మాలలుగా మార్చి ,
నిత్యం ఒక మాలని నీకు అలంకరించనా ?!?!
అలుపెరుగని వేదనని మా అందరికి మిగిల్చి,
ఇహ లోకాన్ని వదిలి వెళ్ళిపోయావు ,
అందని లోకాలకి వెళ్ళిన నిన్ను స్మరిస్తూ
క్షణం ఒక యుగంలా గదిపేయనా ?!?!