ఏమా మౌనం
ఏమా మౌనం


ప౹౹
ఏమా మౌనం ఎదలోని ఆ కోరిక వెల్లడించ
ఏదో ధ్యానం మదిలోని మాట వెలువరించ ౹2౹
చ౹౹
చూసి చూసి కన్నులేమో అలసిసొలసేనులే
వేచి వేచి మనసేమో వెనకడుగూ వేసేనులే ౹2౹
కలలను మానేసినా కన్నులకు కలవరమేగ
ఆశలు ఊసెరగని మనసులో కలకలమేగ ౹ప౹
చ౹౹
ఎన్నాళ్ళీ ఎదురు చూపులు తలపే తెలుప
మూన్నాళ్ళ మచ్చట కాకూడదే ఎద కలుప ౹2౹
ఆమని అడిగిన వేళనే పాటనై ప్రభవించగా
కోరిక కొసరిన ఆపూల తోటనై పల్లవించగా ౹ప౹
చ౹౹
ఏదో రాగం ఎదలోనా ఝమ్మని రాణించగా
ఎడదమొత్తమే వేకువ కోయిలై రవళించగా ౹2౹
వేయి వరములే మరి ఏకమై కురిసినట్లుగా
రేయి వెన్నెలలు ఆలాపనలే అందించెనుగా ౹ప౹