ప్రాణమా! నీకో విన్నపం!!
ప్రాణమా! నీకో విన్నపం!!
...............................
నాలో నీవున్నావని
నేను తెలుసుకొనేప్పటికే..
అందరిలో నీవున్నావని
తెలిసిపోయిందినాకు!
అప్పుడే...
నన్నుప్రేమిస్తున్న వారిలో వున్ననీకంటే...
నాలో వున్ననీవు
నాకు ముఖ్యంకాదని అనిపించింది నాకు.
నాకు తెలీకుండా
నాలోకి దూరిన నీవంటే
నాకు చులకనే మరి!
అయినా.....
నేనిష్టపడేవారిని
నడిపిస్తున్న నీవు మాత్రం..
వదలకుండా పదిలంగా
కలకాలం ఉండాలి మరి!!
నేను ప్రేమించే
తనువుల్లో నున్న నీకోసం...
తెగిస్తున్న నన్ను ...ఆపేస్తూ
నన్నుకన్నోళ్ళు నన్నుకట్టడిచేయటం
నాకేమాత్రం నచ్చట్లేదు
అట్లే....
నాలో నీవున్నంత వరకూ...
నా అన్నవారినుంచినీవు..
విడిపోయివెళ్ళిపోవటం...
నాకే మాత్రం నచ్చట్లేదు!
అందరిప్రాణం నీవుకదూ!
మాబుజ్జివి కదూ!
రావటం పోవటం నీ ఇష్టమేనా?
మనసుపడే నీ మనిషి కోసం!
మథనపడే నీ మనసుకోసం!!
ఉదారంగా ఉమ్మడిగా
కలిసిఉండిపో.. అందరితో...
----------------------------------------