సఖుని విరహ వేదన
సఖుని విరహ వేదన


యద భారంబు గురియించి
సఖుడు ఎట్లు వివరించగలడు
ఏదేమైనా సఖిని చూడకున్న
ఆతని తాపము ఎట్లు శాంతించగలదు
ఎవరెన్ని చెప్పిననూ
ఆమె స్పర్శ లేక
ఆతని తనువు విరహ జ్వాలల నుండి
ఎట్లు బయటపడగలదు
రాచిలుకలూ రాయంచలూ
శ్రావణ మేఘాలూ
శరత్కాలపు వెన్నెలలూ
మీరైనా చెప్పరే సఖికి
సఖుని విరహ వేదన
ఒక్కసారి దరి చేరమని
అతడిని ప్రేమించమని