చెలిమి
చెలిమి


ప||
చెలిమి లోని తీపి గర్తులే దాయవా గుట్టుగ
జ్ఞాపకాల అరలో గుంభనంగ పేర్చవ గట్టుగ
| 2|
చ||
నిన్నరాత్రి నిన్నూ చూస్తుంటే ఏదో జరిగింది
కొత్త మైత్రితో మనసేమో మంచల్లే కరిగింది |2|
ఎరక్కపోయి ఎదురొచ్చి ఎదా రేపే గుబులే
అదేమన్న బదులుగ ఆ పొసగనీ జవాబులే
|ప|
చ||
మనసంతా రణమాయే తెలియకా కారణం
మళ్ళీమళ్ళీ వచ్చునా ఈ వింతైన తరుణం |2|
నువ్వు అవునంటే తీరుస్తా ఈ జన్మ రుణం
కాదంటే ఇప్పుడే ఇక నా పరిస్థితి దారుణం
|ప|
చ||
చేరివచ్చిన చెలిమిలో తీయదనం చెరిసగం
కోరివచ్చిన కొంటెతనం కోరెగ మరో యుగం |2|
హాయినిచ్చిన ఊహలు చూపెగ కొత్త లోకం
వేయిపదులే ఎదిరిచ్చినా కల్గునా ఆ సుఖం
|ప|