నీదరి చేరనీవా ?
నీదరి చేరనీవా ?
నేను ఒంటరిగా
ఈ ఆకాశం క్రింద ఎన్నోరోజులు గడిపా ,
ఊహల్లో తేలి
ఆశించిన ప్రపంచాన్ని చూశా .
మనిషి తీరే నిజానికి అదేమో ,
కావాలనుకున్నది
అందేదాకా మోహమనే దాహమేనేమో !
అలా ఉంటే , చిరుగాలి గుసగుసలు ,
ప్రియురాలి మిసమిసలు .
పువ్వుల సుగంధాలు ,
ప్రేమికులమధ్య ఏర్పడే బంధాలు .
కదిలే మేఘాలు ,
కలసిపాడే ప్రియతమ రాగాలు .
ఎంతబాగా కళ్ళెదుట విందు చేస్తాయో ,
ఆ ఆనందాన్ని పొందకపోతే
విలువైన సమయమెంత వృథాయో !
సురభామినివై నాతో నర్తిస్తావా ?
రథంపై తోడుగా విహారమే చేస్తావా ?

