Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

ప్రేమకానుక

ప్రేమకానుక

1 min
406


నిజంగా అదృష్టమే    

నీలాంటి మనసున్న వారితో పరిచయం .  

నాకళ్ళెదుట ఓ మెరుపులా    

ఆనాడు అది మరపురాని శుభోదయం .


స్వప్నసుందరివై రగిలించావు    

మధురానుభవాలకు నాలో ప్రేమావేశం .  

అందమైన గులాబిలా    

నా హృదయంలోకి జరిగింది నీ ప్రవేశం . 

 

నీతో వేసిన ఒక్కో అడుగు    

మున్ముందుకు నడిపించిన ఒక గెలుపు .  

పట్టుకున్న గొడుగు    

విన్నది నీ ప్రేమను రంగరించిన పిలుపు . 

 

నేటికి మనప్రేమ    

పెళ్ళిగామారిన ఉత్సవానికి పన్నెండేళ్ళు .  

కోరుకుందాం    

ఆనందంగా జరుపుకోవాలని వందేళ్ళు .  


అందుకో    

నా ప్రేమకానుకను ఈ శుభసమయాన .  

పంచుతూనే ఉండు    

మధురిమలను ఇలాగే ప్రతి తరుణాన !  



Rate this content
Log in

Similar telugu poem from Romance