కలతనిదుర (కవిత )
కలతనిదుర (కవిత )
కలత నిదుర //(కవిత)
కలలు లేని కళ్ళు
కలత నిదురలో సుళ్ళు
తిరిగి తిరిగి వేసారి
మనసుతో చెప్పు కుంటే
మాట లేని మనసు
మూగదయ్యి రోదిస్తూ
గుండెలోకి దూరి పోయి
కుములి కుమిలి నీరసిస్తే
గుండె కదిలి కొట్టు కుంటూ
గొంతు దాటి పోతుంటే
పెదవి తలుపు తెరువలేక
పలుకు మరలి ముసుగేస్తే
నిశీధి లో రాగ మేదో
నిశ్శబ్దంగా వచ్చి
పాటపాడి నన్ను
నిద్ర లోకి తోసు కెళ్తూ
వేకువేదో వుంటుందని
ఊసులాడి జో కొడుతూ
ఆదమరుపు కలిగేలా
హాయిగా తల నిమిరింది.

