STORYMIRROR

kvss ravindranath tagore

Drama Tragedy

4  

kvss ravindranath tagore

Drama Tragedy

అరవిచ్చిన అమ్మ...చినబోయింది

అరవిచ్చిన అమ్మ...చినబోయింది

1 min
310

కరెంటు తీగల నడుమన జారే 

వర్షపు బుడగల ఆయుష్షుని పోసుకుని 

నిలిచే మానవుడు కాడు ఏ స్వార్ధానికి

అతీతుడు...,

సహన పూసల దండ వేసుకున్న ధరిత్రి

కూడా జరిగే అవమానాలకి, అకృత్యాలకి

కన్నెర్ర చేసి లోకాన్ని కన్నీరు మున్నీరు

పెట్టిస్తుంది...,

ధరణి కూడా ఈర్ష్య పడే మూర్తిగా

అన్నిటికీ, అంతటికీ,అందరికీ, ఎప్పటికీ

ఆయువుపట్టుగా,ఆదర్శంగా, అమాయకంగా

ఉన్న అమ్మ...

ఎందుకు వరుసలో వెనకబడింది?

కొడుకు భాధ్యతారాహిత్యాన్ని భరిస్తుంది

కూతురి దూరాన్ని దాచుకుంటుంది

కోడలి నిర్లక్ష్యాన్ని సహిస్తుంది

అల్లుడి పట్టింపులని పాటిస్తుంది

మనవళ్ళకి ఆయమ్మగా మళ్ళీ అమ్మ అవుతుంది

అన్నిటికీ మించి కడ దాకా భర్తని మోస్తుంది

ప్రేమే రూపంగా, త్యాగమే ఆధారంగా మెలిగిన

మమతకి విలువ లేదా? విముక్తి రాదా?

తను నిర్వర్తించే కల్లాకపటం లేని కర్తవ్యం

కాదు ఎలాంటి యాగానికి,యోగానికి లోకువ

క్షీర సాగర అమృతాన్ని పంచినవాడికేం తెలుసు

అమ్మ ఎదలో పొంగిన అమృత అలల తడి,

ముక్కంటి మ్రోగించే ఢమరుకాన్ని సైతం ఓడించేది

నిశిలో మౌనంగా మ్రోగే, అలసిన తన కన్నుల చడి...

- విజయ ఠాగూర్



Rate this content
Log in

Similar telugu poem from Drama