ఓ కవితా మాతా... కరావలంబం
ఓ కవితా మాతా... కరావలంబం


నా కరమున పుట్టిన కవిత కాదు నాలుగు మాటల మూట.
ఇలలో పండించలేని కళని కలలో పండించే సేద్యపు తోట
ఉక్కు బిగిసిన శ్వాసకి ఉక్కిరిబిక్కిరి లో దొరికిన చిటపట పాట
చీకటి జీవిత కంచెల దారిలో వెన్నెల వనామాలి వేసిన పూబాట
కష్టాల కొలిమి వేటకి మనసుని తట్టి లేపే మస్తిష్క బావిలో ఊరే రుధిరపు ఊట
కట కట కాలిన కడుపుకి వట వట కారిన కన్నీళ్ళకి తట తట రాలే ప్రాణానికి ముక్తి విముక్తి ఇచ్చే
జట జట ఆడే ఝటాఝాట ఆటగాడి కోటకి చేర్చే తూటా నా కవిత...