STORYMIRROR

kvss ravindranath tagore

Romance

4  

kvss ravindranath tagore

Romance

వెచ్చని వేసవి

వెచ్చని వేసవి

1 min
288

ఈ రోజే తెలిసింది నాకు

నా కలువ కళ్ళని పూయించే

వేసవి సూరీడు నీవని...

ఈ రేయే కలిపింది నీతో

ఈ మగువ ఎదని ప్రేమించే

కోరిన రాజువి నీవని...


అలా ఎలా గడిచాయి ఇన్నాళ్ళు

ఒంటరిగా వేసవి రాత్రులు

ఇపుడిలా మెరిసాయి క్షణాలు

తుంటరిగా పలికే పెదాలు

సుదీర్ఘమైన కబుర్లతో నిండిన

అల్లరి ఉదయాలు

ఎదకి హత్తుకుపోయి అలసిన 

మౌన అమావాసలు


మెచ్చిన గాయాల మీద చల్లని

నీ శ్వాసలు

వెచ్చని గాలుల మీద చల్లిన

ఋతు పవనాలు

కౌగిలిలో మరిగిన వేడి చెమటలు

మజిలిలో కరిగిన చిరు దూరాలు


నీ వల్లే ఇలా నాలా ఎప్పుడూ లేని

నన్ను కొత్తగా చూస్తున్నా నాలో

నీతోనే అలా అలా ఎప్పుడూ రాక

నన్ను చింతగా ఆపగలనా లోలో

ఈ రోజే తెలిసింది నాకు

నా కలువ కళ్ళని పూయించే

వేసవి సూరీడు నీవని...

ఈ రేయే కలిపింది నీతో

ఈ మగువ ఎదని ప్రేమించే

కోరిన రాజువి నీవని...

- విజయ ఠాగూర్



Rate this content
Log in

Similar telugu poem from Romance