ఆమె
ఆమె


మట్టిలోంచి
పట్టుదలతో
మొలకెత్తిన విత్తనం
ఉరుముల్ని
దాచుకున్న మేఘం
పిడుగుపాట్లను
భరించిన భూమి
తుఫానొచ్చినా
తట్టుకొని
ఊపిరి బిగబట్టుకొని
నిలిచిన వృక్షం
మనుగడకై
తపిస్తుంది ప్రతీక్షణం
కష్టాలు
కనబడని గాలి
లోలోపల దహిస్తాయి
మంటై తనని
కన్నీళ్ళే
ఈ మహాసముద్రాలు
పంచభూతాలకొక
చక్కని చీరకట్టిన రూపం
అఖండ దీపం
ఆమె
ఒక చైతన్యం
ఆమె
ఒక మహాశక్తి రూపం!