STORYMIRROR

Amarnadh Chavali

Others

4  

Amarnadh Chavali

Others

ఇంపోర్టెడ్ కష్టం

ఇంపోర్టెడ్ కష్టం

1 min
23.1K

కాలం కష్టాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. వాళ్లెప్పుడు ఇంపోర్టెడ్ మందు తాగలేదు కనీసం ప్రపంచ చిత్రపటం లో ఆ దేశాన్ని చూడలేదు.

మడమలు మండుటెండలో చిట్లాయి. కానీ వెనక్కి తిరగలేదు. రోడ్ల అంచ్చులో అన్ని ఊళ్లే కానీ ఎక్కడా చోటు దొరకలేదు. ఆ వేప చెట్టు కిందే సుఖ సెయ్య పాన్పు. కడుపు నిండా వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని ముందుకు సాగారు. ఆడేవడో ప్రేమకోసం సైకిల్ ఎక్కి విదేశాలకు పోయాడంట. గొప్ప ప్రేమికుడు. మరి వీళ్ళో? వాళ్ళు నడిచిన దారి బ్రతుకు కోసం కట్టిన బ్రతకు సేతు. ప్రతొడు రాముడే. కాకపోతే ఒక్క రాత్రే బ్రతుకు సేతు గుర్తు. తెల్లారాక. బస్సులు. లారీలు. బైకులు చేరిపేసిపోతాయి.

అయినా వాళ్ళు మౌనం గా నడక మొదలెట్టారు. నేను మడత మంచం లో నడుం వాల్చి క్వారంటైన్ లో క్వాలిటీ లైఫ్ ఎంజాయ్ చేసాను.

వాళ్లు రాలిపోయారు. నేను మొఖానికి ముసుగు వేసుకొని భయపడుతూ టివి లో లైవ్ అప్డేట్ చూసాను.

వాళ్ళు వెనక్కి రారు సూర్య చంద్రులు వచ్చిపోతున్నా. నేను మార్నింగ్ టీ కాఫీలు నైట్ రెండు పెగ్గులు వేసుకొని డిబేట్లు పెట్టాను.

కొంతమంది ఇళ్ళకి చేరారు కొంతమంది మధ్యలో ఆగి పోయారు. నేను అరెరే అన్నాను. 


Rate this content
Log in