STORYMIRROR

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

4  

Nannam Lokesh

Abstract Fantasy Inspirational

నిరీక్షణ

నిరీక్షణ

1 min
300

నీలి కన్నుల వలె మెరిసిపోతావేమో

అనేలోపె తోకచుక్కనై జాడలేకున్న

ఆకాశమైన ఎగరగలవేమో

అనేలోపె నింగిలోని తారగా ఎదురుచూస్తున్న


పరిహసాలు ఆడుతావేమో

అనేలోపె హృదయంలో మౌనం వహిస్తున్న

కొంటేకొరికలు అడుగుతావేమో

అనేలోపె అదృశ్యమై ఉంటున్న


నిర్మలమైన మనస్సుతో ప్రేమిస్తావేమో

అనేలోపె కనుమరుగై నిలుస్తున్న

జ్ఞాపకాలు మిగులుస్తావేమో

అనేలోపె ఒంటరినై ఉండిపోతున్న


స్వచ్ఛమైన అమృతమిస్తావేమో

అనేలోపె కడగంటి పోతున్న

స్ఫూర్తిని ఒసగుతావేమో

అనేలోపె కోపాన్ని చూపలేకున్న


జీవితంలో కడవరకు ఉంటావేమో

అనేలోపె పరిణయం ఆడలేకున్న

భాగస్వామిగా తోడువుంటావేమో

అనేలోపె బాధ్యతలు నేర్చుకుంటున్న


కరుణ గల మదిలోకి వేంచేస్తావేమో

అనేలోపె కలలుగా మిగిలిపోతున్న

భార్యగా ఒక చోటిస్తావేమో

అనేలోపె భర్తగా వేచిచూస్తున్న


చూసే కన్నులు కాయలు కడుతాయేమో

అనేలోపె చూడలేకుంటున్న

భావాలు బారమై పోయ్యాయేమో

అనేలోపె నిరీక్షణగా నిలిచిపోతున్న


 


Rate this content
Log in

Similar telugu poem from Abstract