గురువు ఎందుకో వెనకబడ్డాడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
విద్యార్థులకు రాయడం,చదవడం నేర్పినప్పుడు
మేము రాయము అని వాళ్లు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
విద్యార్థుల్ని దండించినప్పుడు
తల్లిదండ్రుల ఫిర్యాదులకు క్షమాపణ చెప్పినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
విద్యార్థులకు అర్థం కాని సమయంలో వివరించి చెప్పినప్పుడు
వచ్చే విమర్శను ఎదుర్కొన్నప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
పరీక్ష జరిగే సమయంలో పదిసార్లు వివరించినప్పుడు
అయిన మాకు అర్థం కాలేదు అని విద్యార్థులు చెప్పినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
క్రమశిక్షణ నేర్పినప్పుడు
విద్యార్థులకు భయభక్తులు లేకపోవడం చూసినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
విద్యార్థులకు, పాఠశాలలకు మధ్యవర్తిగా ఉన్నప్పుడు
ఒక వారధిగా పాఠాలను బోధించినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
బెత్తంతో లేదా చెంప దెబ్బ గట్టిగా లేక సన్నగా కొట్టినప్పుడు, విద్యార్థులు ఓర్చుకోలేనప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
బోధనను ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పినప్పుడు
విరామం, అలసట లేక, విద్యార్థులకు ఇంకా నేర్పలేదే అనే తపన తనలో కలిగినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
మారుతున్న సమాజానికి మార్చుకొని బోధించినప్పుడు
విద్యార్థులు అర్థం చేసుకోనప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
విద్యార్థుల నడవడికను, ఆలోచనలను మార్చుకోమని చెప్పినప్పుడు
మాట ద్వారానో, చేతి ద్వారానో దండించినప్పుడు
గురువు ఎందుకో వెనకబడ్డాడు
