నేర్చుకో - ఎదుగు (కవితా గేయం )
నేర్చుకో - ఎదుగు (కవితా గేయం )
నేర్చుకో - ఎదుగు (కవితా గేయం )
కవీశ్వర్ 26 .06. 2026
పల్లవి :
నేర్చుకో , నేర్చుకో - నేర్చుకొని జీవితాన ఎదుగండి
అమ్మ-నాన్నలు గర్వపడేలా మీరు ప్రవర్తించండి
మీ ఆశయాలు తీర్చుకునే అవకాశం కల్పించుకోండి
గురువులకు , విద్యాలయానికి గొప్ప పేరును తెప్పించండి
\\ నేర్చుకో, నేర్చుకో \\
చరణం : 1
నిస్వార్థ సేవలో యోచించే స్నేహితులను ఆదరించండి
ఎల్లప్పుడూ చెడు గాప్రవర్తించే వారితో అప్రమత్తంగా ఉండండి
ఎదిగి ఎదిగి మీ జీవిత గమ్యాన్ని తగిన వేళకునిక్కముగా చేరుకోండి
సహకారము, సహయోగము అవసరమైన వారికి సత్వరం అందించండి
\\ నేర్చుకో , నేర్చుకో \\
చరణం : 2
పాడుతూ , పాడుతూ మీ సంగీత జ్ఞానాన్ని పెంచుకోండి
ఆడుతూ , ఆడుతూ మీ క్రీడా కౌశల పరిధి ని విస్తరించండి
చేస్తూ, చేస్తూ పరిజ్ఞాన పరికల్పనలు సమాజంలో స్వీకరించండి
హాయి హాయిగా ప్రయోజనాలను స్వీకరించి అవసరానికి పంచండి.
\\ నేర్చుకో , నేర్చుకో \\
