శనైశ్చర కవితా గీతం 04- 10- 2026 కవీశ్వర్
శనైశ్చర కవితా గీతం 04- 10- 2026 కవీశ్వర్
శనైశ్చర కవితా గీతం
04- 10- 2026 కవీశ్వర్
పల్లవి:
జయ జయ జయ శనిదేవ కాదు రమ్యమాయనీ న్యాయా
ఛాయా పుత్రుడనీవేనయా సకల కర్మ ఫల ప్రదాతవయా
\\ జయజయ \\
చరణం :1.
ఒకరికి ఖేదం ఒకరికి మోదం నీ ఫలితాలు మోసే జనులేనయా
నీవారే పూజలు ముదమున భక్తిచే శనివారముకొలిచేకారములయా
ప్రీతిగా మాచే తైలాభిషేకం జరిపించుకొనే మా వరప్రదాతవయా
మా దోషముల మన్నించి అనంత సిరులను మాకు ఒసగుమయా
\\ జయజయ \\
చరణం : 2.
జప,తప హోమం తొలగును క్షామం నీ నియమాలే మా దారులయా
త్రయోదశులు,అమావాస్యలు,నీ జయంతియే ప్రత్యేక పండుగలయా
క్రూర కర్మలకు తగిన ఫలితాలిచ్చే మా సవరణలు కోరే దయామయా
జ్యేష్టా(దామినీ) పతివై మందముగా చరించే సుందర మార్తాండ తనయా
\\ జయజయ \\
చరణం: 3 .
నల , శివ , హరిశ్చంద్ర సన్మార్గ పయనమున దక్షత చూపితివయా
వాయస వాహన చరిత గొప్పతనాన్నేరమ్యముగా చిత్రించితివయా
కర్తవ్య పరాయణ , అగ్రజుని స్వ పథాన పయనించి తరించితివయా
నీ ధామాల దర్శన,పూజాభిషేకాల జరిపే భక్తుల పై కృపజూపితివయా
\\ జయజయ\\
ఇది నా స్వీయ రచన .
కవీశ్వర్ జయంత్ కుమార్
బుద్వేల్ , హైదరాబాద్ .
