STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Thriller

4  

Dinakar Reddy

Abstract Drama Thriller

ఒక కల

ఒక కల

1 min
409

మాట్లాడే గండభేరుండాలు

కురిసే నవరత్నాలు

విరివిగా మంత్రదండాలు

పూయని చెట్లు

వాడని తిట్లు


తెల్లటి ఆకాశం

నల్లటి గోడలు

ఎర్రటి చినుకులు

వినలేని పలుకులు


చదువుకు విలువ పోయింది

విలువల అర్థమే మారింది

సంస్కారం దాక్కుంది

అహంకారం అల్లుకుంది


చీకట్లు పులుముకునే వేళ

కొత్త జీవితాల ఆరంభాలు

తెలవారే వేళ

వెలకట్టే నిశాచరులు 


కల అని తెలిసేసరికి

అతడు పలవరించాడు

అతని పలకరింపు మార్చుకున్నాడు

జగత్తు మిథ్య అని ఒప్పుకున్నాడు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract